దొంగతనాల నివారణకు ఆటో వెనక అవగాహన పోస్టర్

by Ratna Kumari |   (  Updated:2026-01-09 15:45:13  IST  )

సంక్రాంతి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్పీ జానకి ఇచ్చిన సూచనలు మేరకు టూ టౌన్ పోలీస్ పోలీసులు బ్యానర్ల ను ముద్రించి ఆటోల వెనుక తగిలించి, కరపత్రాలను పంచుతూ, ఆడియో సందేశాలతో వినూత్న ప్రచారం చేపట్టారు.

దొంగతనాల నివారణకు ఆటో వెనక అవగాహన పోస్టర్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సంక్రాంతి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్పీ జానకి ఇచ్చిన సూచనలు మేరకు టూ టౌన్ పోలీస్ పోలీసులు బ్యానర్ల ను ముద్రించి ఆటోల వెనుక తగిలించి, కరపత్రాలను పంచుతూ, ఆడియో సందేశాలతో వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ ఇజాజొద్ధీన్ మాట్లాడుతూ సెలవుల్లో ఇండ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగ్గా మూసివేయడం, విలువైన వస్తువులు భద్రపరచడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు, నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు, ఊర్లకు వెళ్లే ముందు టూ టవున్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని, ఇందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఇవ్వాలంటే 100 కు లేదా 112 కు కాని, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659360 కానీ సమాచారం ఇవ్వాలని సీఐ ఇజాజొద్ధీన్ కోరారు.

Next Story