- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన్వాడ లో ఆటో బోల్తా.. ఒకరు మృతి
by Ratna Kumari |
ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు 15 మందికి గాయాలైన సంఘటన ధన్వాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు 15 మందికి గాయాలైన సంఘటన ధన్వాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోలో ఉన్నటువంటి 15 మందికి గాయాలయ్యాయి. ధన్వాడ మండల కేంద్రం నుంచి అప్పంపల్లికి వెళుతున్న కూలీల ఆటో పోలీస్ స్టేషన్ దగ్గర పంది అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాయాలైన వారిని తరలించారు. తీవ్ర గాయాలు అయినటువంటి వ్యక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనను పార్లమెంటు సభ్యులు డీకే అరుణకి చరవాణి ద్వారా సమాచారం అందించారు. గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సూచించారు ఎంపీ డీ.కే. అరుణ.
Next Story






