ఆటో డ్రైవ‌ర్ అదృశ్యం

by Ratna Kumari |   (  Updated:2025-12-07 14:52:43  IST  )

దిశ‌, ఊట్కూర్ : ఆటో డ్రైవ‌ర్ అదృశ్యమైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చిన్న‌పోర్ల గ్రామంలో చోటు చేసుకుంది.

ఆటో డ్రైవ‌ర్ అదృశ్యం
X

దిశ‌, ఊట్కూర్ : ఆటో డ్రైవ‌ర్ అదృశ్యమైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చిన్న‌పోర్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ర‌మేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని చిన్నపోర్ల గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్(35) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు ఎల్లమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 6న రాత్రి ఇంట్లో తిని అందరూ పడుకోగా.. మరుసటి రోజు తెల్లవారుజామున భార్య ఎల్లమ్మ భర్తను చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువులను సంప్ర‌దించినా ఆచూకి ల‌భించ‌లేదు. అలాగే ఫోన్ చేయగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయ్ కుమార్ భార్య ఎల్లమ్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

Next Story