- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, ఆత్మకూరు : ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఆర్. సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ రవీందర్, కామరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఒక ఆశోక్ లేలాండ్ ట్రాలీని గమనించారు. పోలీసులను చూసి వాహనం పారిపోవడానికి ప్రయత్నించడంతో వెంటనే ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో వాహనంలో పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. విచారణలో వారు ఆత్మకూరులో ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున బియ్యం కొనుగోలు చేసి, కిలోకు రూ.18కి అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్నామని ఒప్పుకున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం 35 సంచులను (రూ.30 వేల )విలువగల స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనలో కామరం గ్రామానికి చెందిన సన్నబోయిన రాజేష్ రాడారపు ప్రశాంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.అలాగే బియ్యంతో పాటు వాటిని తరలించడానికి ఉపయోగించిన ఆశోక్ లేలాండ్ ట్రాలీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు.






