- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్షలంటే ... భయమా..!?
ఎస్ఎస్సి పరీక్షలు వస్తున్నాయి కదా..!? బాగా చదువుతున్నారా..!? అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విద్యార్థినీయులను ప్రశ్నించారు

దిశ, భూత్పూర్: ఎస్ఎస్సి పరీక్షలు వస్తున్నాయి కదా..!? బాగా చదువుతున్నారా..!? అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విద్యార్థినీయులను ప్రశ్నించారు. బుధవారం రాత్రి భూత్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ లో రాత్రి బస చేయడానికి వచ్చిన సందర్భంగా విద్యార్థినులతో డిఇఓ ప్రవీణ్ కుమార్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని జరిగిన బేగం, మార్కెటింగ్ అధికారిని బాలమణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఇందిర, తదితరులతో కలిసి బుధవారం రాత్రి భూత్పూర్ కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ, ఉపాధ్యాయినీలు, సిబ్బంది, విద్యార్థినిలు కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులలో మాటామంది జరిపి.. కేజీబీవీ లో ఉన్న సమస్యలపై ఆరా తీశారు.
కలెక్టర్: ఇక్కడ ప్రధానంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి..!? మీకు పాఠాలు బాగా చెబుతున్నారా..!?
విద్యార్థినిలు: మేడం ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమీ లేవు.. మా మేడం వాళ్ళు పాఠాలు బాగా చెబుతున్నారు.. మేము బాగానే చదువుతున్నాం..
కలెక్టర్ : ఏమి సమస్యలు లేకుంటే.. నేను వచ్చి వేస్ట్ అన్నమాట ..!? మీకు ఒక్క సమస్య కూడా లేదా..!?
విద్యార్థినిలు : మేడం మాకు
డైనింగ్ హాల్, ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు.. దీనివల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం..?
కలెక్టర్ : మరి ఇందాక సమస్యలు లేవన్నారు కదా.. సరే గ్రౌండ్ ఏర్పాటు చేయడంతో పాటు.. డైనింగ్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం..
కలెక్టర్ : మీకు కమిటీలు ఉన్నాయా..!?
విద్యార్థినులు : ఉన్నాయి మేడం.. పారిశుద్ధ్య కమిటీలు, ఆహార కమిటీలు, గేమ్స్ కమిటీలు .. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి మేడం..!?
కలెక్టర్: ఆహార కమిటీలో ఎవరెవరు ఉన్నారు లేవండి .. మీరు ఏమేం బాధ్యతలు నిర్వహిస్తున్నారు..!?
కమిటీ సభ్యులు : మేడం ఫుడ్ అందరూ బాగా తింటున్నారా లేదా.. అని పరిశీలిస్తుంటాం.. సరిగా తినని వారిని తినేలా చేస్తాము.. వినకుంటే మేడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం..
కలెక్టర్ : ఇక్కడ తయారు చేస్తున్న మెనూలో మీకు బాగా నచ్చినవి ఏమిటి..!?
విద్యార్థినులు : మాకు అన్ని వంటకాలు బాగానే ఉంటున్నాయి మేడమ్.. ఇడ్లీ, సాంబారు అంటే చాలా ఇష్టం..
కలెక్టర్ : ఓకే .. బాగా తినాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. మరి రోజు స్నానాలు చేస్తున్నారా..!?
విద్యార్థులు : చేస్తున్నాం మేడం.. స్టడీ అవర్స్ వరకు అందరము చేస్తున్నాము..
కలెక్టర్ : మరి బాత్రూంలు సరిపోతున్నాయా..!?
విద్యార్థునిలు: లేదు మేడం కొంత ఇబ్బందిగా ఉంది.. మరికొన్ని కట్టిస్తే బాగుంటుంది..
కలెక్టర్ : తప్పకుండా.. మీరు బాగా చదవండి. అని ఎస్ఎస్సి విద్యార్థినీల వద్దకు వెళ్లి.. పరీక్షలకు బాగా సిద్ధం అయ్యారా..!? మొదటి రోజు తెలుగు పరీక్ష కదా బాగా రాస్తారా..!?
విద్యార్థినీలు : అయ్యాం మేడం.. మొదటిరోజు పరీక్ష రాయడం ఎలా ఉంటుందో అని కొంత భయం అవుతుంది మేడం..
కలెక్టర్ : భయపడవలసిన అవసరం లేదు.. ఇంతకుముందు తరగతుల పరీక్షలు రాసి ఎలా పాస్ అయ్యారో..!? అలాగే ధైర్యంగా రాయండి.. స్మార్ట్ వర్క్ చేయండి.. మంచి మార్కులు వస్తాయి.. కొన్ని తక్కువ వచ్చిన పర్వాలేదు.. మున్ముందు మరింత కష్టపడాలి..
విద్యార్థినీలు : సరే మేడం..!
అని విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.






