ఏసీబీకి పట్టుబడ్డ మరో జిల్లా అధికారి

by Ratna Kumari |   (  Updated:2026-01-08 15:37:17  IST  )

రెండు నెలలనే వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం సంచలనంగా మారింది.

ఏసీబీకి పట్టుబడ్డ మరో జిల్లా అధికారి
X

దిశ, వనపర్తి : రెండు నెలలనే వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం సంచలనంగా మారింది. గురువారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల భవనాల సముదాయలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అ.ని.శా డీఎస్పీ సీ.హెచ్. బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒక మిల్లు ఓనర్ కు సీఎంఆర్ రైస్ కేటాయింపు చేయడం కోసం వనపర్తి డిస్టిక్ మేనేజర్ కుంభ జగన్మోహన్ రూ.1,75,000 డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ.50,000 రూపాయలు సదరు మిల్లు యజమానితో జిల్లా మేనేజర్ జగన్మోహన్ తీసుకొంటుండ‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ విచారణ అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టు లో అధికారిని హాజరుపరుస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే తమకు టోల్ ఫ్రీ నెంబర్ 1064,లేదా సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన భాదితులకు వివరాలు గొప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.

Next Story