- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అటవీ శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగిపై దాడి..!
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అటవీశాఖ డివిజనల్ అధికారి కార్యాలయంలో పని చేస్తున్న సూపరింటెండెంట్ రాజు పై మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ రాములు, అతని కుమారులు దా

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అటవీశాఖ డివిజనల్ అధికారి కార్యాలయంలో పని చేస్తున్న సూపరింటెండెంట్ రాజు పై మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ రాములు, అతని కుమారులు దాడి చేసిన సంఘటన గురువారం డీఎఫ్ఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. మద్ది మడుగు ఆలయ కమిటీ చైర్మన్ రాములు అటవీశాఖ డివిజనల్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకొని నీతో మాట్లాడాలని బయటికి రావాలని రాజుని పిలిచాడు. చెప్పు మామ ఇక్కడే మాట్లాడు అంటున్న సందర్భంలోనే అతని కుమారులు వెంకట్ రామ్, చందుతో పాటు మరికొంత మంది అందరూ కలిసి విచక్షిణ రహితంగా దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. దాడి సమయంలో అటెండర్, మరో వ్యక్తి కార్యాలయం వద్దనే ఉన్నారని.. ఎందుకు దాడి చేస్తున్నారని అడుగుతున్నా.. పట్టించుకోకుండానే దాడి చేశారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
మా అక్క బావకు సంబంధించినటువంటి కుటుంబ విషయంలో మాట్లాడటానికి వచ్చారని భావించానని.. ఎందుకు దాడి చేశారో తెలియదు అన్నారు. పోలీసులకు విషయం చెబుదామని ఫోన్ తీయగానే ఫోన్ ను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటికే పోలీసులు వస్తున్నారనే విషయం తెలియడంతో పారిపోయారని తెలిపారు. వారితో పాటు కొంత మంది కార్యాలయం వద్ద గుమికూడి ఉన్నారని.. బాధితులను దిశా ఫోన్ ద్వారా కలిసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అచ్చంపేట ఎస్సై ఇందిరమ్మను ఫోన్ ద్వారా దిశ ప్రతినిధి వివరణ కోరగా.. కుటుంబ సమస్య ఉందని.. ఫిర్యాదు రాస్తున్నట్టు చెప్పింది.






