అక్టోబ‌ర్ 01 నుంచి అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ సఫారీ సేవలు పునరావృత్తం

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అందాలను తిరిగి బయట ప్రపంచ యాత్రికులకు పకృతి ప్రేమికులకు తిలకించే సందర్భం రానే వచ్చింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు సఫారీ సేవలను అటవీ

అక్టోబ‌ర్ 01 నుంచి అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ సఫారీ సేవలు పునరావృత్తం
X

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అందాలను తిరిగి బయట ప్రపంచ యాత్రికులకు పకృతి ప్రేమికులకు తిలకించే సందర్భం రానే వచ్చింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు సఫారీ సేవలను అటవీ శాఖ అధికారులు పెద్ద పులుల సంరక్షణ ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తి రోజులుగా ప్రకటించిన నేపథ్యంలో 90 రోజుల పాటు సఫారీ సేవలు అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో పూర్తిగా నిలిచిపోయాయి. తిరిగి ఆ సేవలను నేటి నుంచి అనగా అక్టోబర్ ఒకటి నుంచి పునరావృతం అవుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద అటవీ ప్రాంతం..

నల్లమల్ల అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతాన్ని దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రాలలో ఒకటి. ఈ అరణ్యంలోని సమృద్ధమైన వన్యప్రాణులను సుందరమైన ప్రకృతి దృశ్యాలను పర్యాటకులు చూస్తూ పకృతి ప్రేమికులకు మరింత అనుభూతి అనుభవించేందుకు బుధవారం నుంచి సఫారీ సేవలను అందుబాటులోకి తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ అనుభూతిని పొందడానికి అందరికీ అవకాశం ఉంది. నల్లమల్ల ప్రాంతాన్ని సఫారీ ద్వారా పర్యటించే సందర్శకులు రిజర్వ్‌లోని కోర్, బఫర్ ప్రాంతాలలో నిర్వహించబడే గైడ్ సఫారీ రైడ్స్ ద్వారా పులులు, చిరుతలు, అడవి కుక్కలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, విభిన్న జంతువులు, పక్షులు, వృక్షజాలాన్ని వీక్షించవచ్చు. ఈ సఫారీలు శిక్షణ పొందిన నేచర్ గైడ్లు, డ్రైవర్ల పర్యవేక్షణలో నిర్వహించబడతాయి.

ఈ ప్ర‌దేశాల్లోనే స‌ఫారీ సౌక‌ర్యం..

సఫారీ ద్వారా యాత్రికులు అమ్రాబాద్ మండలం మన్ననూర్, దోమల పెంట రేంజ్ పరిధిలో గల ఫరహాబాద్, గుండం, దోమలపెంట (అక్క మహాదేవి సఫారీ) ఇతర నిర్ణీత ప్రదేశాలలో సఫారీ సౌకర్యాలు లభ్యమవుతాయి. పర్యాటకులు ప్లాస్టిక్ వాడరాదు. అలాగే చెత్త వేయరాదు, వన్యప్రాణులకు ఆహారం పెట్టరాదు. సఫారీ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి. ఎకోటూరిజం నియమాలను పాటించాల్సి ఉంటుంది. సఫారీతో పాటు ఉమామహేశ్వరం, ప్రతాపరుద్ర, రేగడి ట్రెక్కింగ్ మార్గాలు కూడా సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సహజ సౌందర్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించవచ్చు. ప్రకృతి ఒడిలో పర్యాటకులను అటవీ శాఖ అధికారులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

Next Story