గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : ఏఐటీయూసీ

by Ratna Kumari |   (  Updated:2026-02-06 13:28:29  IST  )

నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు పి.వెంకటేష్ అన్నారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి :  ఏఐటీయూసీ
X

దిశ, మరికల్ : నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు పి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి.వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి నెలలు గడుస్తున్న నేటికీ జీతాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వారిస్తున్నారని మండిపడ్డారు. మరికల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు చేతి గ్లౌజులు, షూస్ పనిముట్లు అందక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు అందించాలని తెలిపారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 12న తలపెట్టిన కార్మిక సమ్మె విజయవంతం చేయాలని ఆయన కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల సూపర్డెంట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు బాలయ్య రాములు, రాజన్న, ఎం.రాజు, మోహన్ బాబు, యువరాజు కొండమ్మ, అరుణ, సరోజ, లక్ష్మమ్మ, మహేశ్వరి, బి.లక్ష్మమ్మ, అనసూయమ్మ, పి.లక్ష్మి, రాజమౌళి, రఘు పాల్గొన్నారు.

Next Story