- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే మేఘారెడ్డి
రాహుల్ గాంధీని ప్రధాని గా చేసేంతవరకు ప్రతి ఒక్కరం విశ్రమించకుండా కృషి చేయాలనీ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, వనపర్తి : రాహుల్ గాంధీని ప్రధాని గా చేసేంతవరకు ప్రతి ఒక్కరం విశ్రమించకుండా కృషి చేయాలనీ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 09 నుంచి 16 వ తేదీ వరకు బూత్ స్థాయి కమిటీ, వార్డ్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా బూతు అధ్యక్షులను కూడా నియమించనున్నామన్నారు.
ఓటు హక్కు ఉన్న బూతులోనే అక్కడి నాయకుడు బూతు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. వీటితో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎన్.ఎస్.యూ.ఐ విభాగాలను సైతం సంఘంను ఏర్పాటు చేయనున్నామన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం కూడా ఎన్నుకోబడుతుందని.. ఎవరైతే ఉత్సాహంగా పని చేసేందుకు ముందుకు వచ్చిన మహిళలకు ప్రాధాన్యతఇవ్వబడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి సంసిద్ధంగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఎవరు కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






