ఏసీబీ కి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

by Ratna Kumari |   (  Updated:2025-11-18 10:02:26  IST  )

దిశ, గోపాల్ పేట : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడుతున్న సంఘటనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం విద్యుత్ శాఖ

ఏసీబీ కి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
X

దిశ, గోపాల్ పేట : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడుతున్న సంఘటనల పరంపర కొనసాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ట్రాన్స్ ఫార్మర్ మంజూరి కోసం రూ.20వేలు లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖ ఏఈ గా విధుల్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ మంజూరు చేసేందుకు రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు అంత ఇచ్చుకోలేను అని కోరగా.. చివరకు. 40 వేలకు తగ్గేది లేదు అని తేల్చి చెప్పడంతో.. ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రైతు కు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారధ్యంలో అధికారులు డబ్బులు ఇచ్చి పంపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి రైతు 20వేల రూపాయలు ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ నుంచి రూ.20వేలు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారు. ఇటీవలే విద్యుత్ శాఖలోనే పనిచేస్తున్న మరో అధికారి సోదరీమణితో కోటి రూపాయల కట్నంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ ని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వెల్ల‌డించారు. ఏసీబీ డీఎస్పీ బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఇన్ స్పెక్ట‌ర్ లింగ‌స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. వ‌న‌ప‌ర్తి డీఈ, ఏడీ గోపాల్ పేట విద్యుత్ కార్యాల‌యానికి వ‌చ్చారు. వారి ద్వారా డీఎస్పీ బాల‌కృష్ణ వాంగ్మూలం తీసుకున్నారు.

Next Story