ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాయ‌కుండా వెళ్లిపోయిన విద్యార్థి

by Ratna Kumari |

వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన భూత భరత్, గోపాలపేట ఎస్సీ హాస్టల్‌లో ప‌దో తరగతి చదువుతున్నాడు. పరీక్షల సమయంలో ఆసక్తి లేక హైదరాబాద్ కి వెళ్లిపోయాడు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాయ‌కుండా వెళ్లిపోయిన విద్యార్థి
X

దిశ‌, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన భూత భరత్, గోపాలపేట ఎస్సీ హాస్టల్‌లో ప‌దో తరగతి చదువుతున్నాడు. పరీక్షల సమయంలో ఆసక్తి లేక హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జగన్మోహన్, క్లాస్ టీచర్ ధర్మరాజు భరత్ ఇంటికి వెళ్లి తండ్రి భూత రాములు తో మాట్లాడి సమాచారం సేకరించారు. విద్యార్థిని తిరిగి పరీక్షల వైపు మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విద్యార్థి ఇవాళ జ‌రిగిన తెలుగు ప‌రీక్ష రాయ‌లేదు. ఈనెల 18 నుంచి జ‌రిగే ప‌రీక్ష‌ల‌న్నింటిని రాపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Next Story