- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ లో సమ్మె తప్పదు : జేఏసీ నాయకులు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె అని వార్యమని ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్ రెడ్డి, ఈదురు వెంకన్నలు స్పష్టం చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె అని వార్యమని ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్ రెడ్డి, ఈదురు వెంకన్నలు స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు నిర్వహించిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు కార్మికుల జీతభత్యాల సవరిస్తామని, ఆర్టీసీ లో యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామనే అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి రెండన్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీ లు, ట్రేడ్ యూనియన్ల పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి యూనియన్ లను పునరుద్దరించాలని, ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనంచేసి అపాయింటేడ్ డే ప్రకటించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి ఉద్యోగ నియామకాలను చేపట్టాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం లేబర్ కమిషనర్ తో జరిగే చర్చల పురోగతిని బట్టి సమ్మె తేది ని ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహబూబ్ నగర్ డిపో లో పనిచేస్తున్న జి.లక్ష్మణ్ గౌడ్, విజయబాబు లను రాష్ట్ర జేఏసీ కమిటీలో స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, యాదయ్య, యాదగిరి, డబ్ల్యూకె బసప్ప, అరవింద్, ఎదిర నర్సింహులు, సత్యశీలా రెడ్డి, దమాయ్యపల్లి శ్రీనివాసులు, కెఎస్ నారాయణ, సురేష్, రాజలింగం, సుల్తాన్, రహెమాన్, చంద్రమోహన్, జీజె రావు, వెంకటయ్య, జీవనజ్యోతి, శిరీష, చంద్రకళ, స్వాతిప్రియ పాల్గొన్నారు.






