- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు కార్పొరేషన్ కు స్వర్ణ యుగం
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు అభివృద్ధి పరంగా స్వర్ణ యుగం రానుంది అని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు అభివృద్ధి పరంగా స్వర్ణ యుగం రానుంది అని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1952లో మున్సిపాలిటీగా ఏర్పడిన మహబూబ్ నగర్ ప్రతి ఏటా నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చిందని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఉన్న సమయంలోను.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు.. మహబూబ్ నగర్ పట్టణాన్ని కూడా అన్ని విధాల పాలకులు నిర్లక్ష్యం చేశారు అని ఎమ్మెల్యే చెప్పారు. 75 సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ కు మహర్దశ వచ్చింది అన్నారు. ఈ ప్రాంత బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో మహబూబ్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి పరుచుకుంటున్నాము అని చెప్పారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో రూ.2500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు రూ.1284 కోట్లతో మహబూబ్ నగరాన్ని మరింత అందంగా రూపొందించుకోబోతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. బాసర తర్వాత ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ నీ నిర్మించుకోబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వరంగల్, హైదరాబాద్ తరహాలో 603 కోట్ల రూపాయల అంచనాలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 220 కోట్లతో మంచినీటి సరఫరా ఏర్పాట్లు, 20 కోట్ల రూపాయలతో ఎంవీఏస్ డిగ్రీ కళాశాల నూతన భవనం నిర్మాణానికి , ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న త్రిబుల్ ఐటీ భవన నిర్మాణంతోపాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేస్తారు అని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మహబూబ్ నగర్- జడ్చర్లను కలిపి మహానగరంగా..
2047 సంవత్సరం వరకు సరిపడ మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే భూత్పూరు.. మహబూబ్ నగర్, జడ్చర్లను కలిపి మహానగరంగా రూపొందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బెంగళూరు-హైదరాబాద్ నగరాల మధ్య అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాధించేందుకు అనుకూలంగా ఉన్న మహబూబ్ నగర్ ను విద్య, వైద్య, పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ పనులను త్వరలోనే చేస్తాము అని ఎమ్మెల్యే వెల్లడించారు. పాలమూరు.. రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను తక్షణమే చేపట్టి పూర్తిచేసి.. మూడు సంవత్సరాల కాలంలో పాలమూరు.. రంగారెడ్డి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ పట్టణంతోపాటు, ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మేమంతా కృషి చేస్తున్నాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీv కళాశాల మైదాన ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు సరేలే వచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.






