- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ అధికారులపై కేసు నమోదు చేయాలి : జర్నలిస్టులు
దిశ, నారాయణ పేట క్రైమ్ : జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ అధికారులపై కేసు నమోదు చేయాలని జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం

దిశ, నారాయణ పేట క్రైమ్ : జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ అధికారులపై కేసు నమోదు చేయాలని జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నారాయణ పేట పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టులు ఆర్టీసీ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ మీడియా కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుల పై కుట్ర పూరితంగా ఆర్టీసీ శాఖను సమాచారం కోరారు. అయితే ఆ సమాచారం ఇస్తే.. ఎక్కవ తమ ఉద్యోగ భవిష్యత్ కి ఇబ్బంది అవుతుందోనని ముందస్తు ఆలోచనతో కుట్ర పూరితంగా జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. సీఎం, డీజీపీ ని కలిసి నారాయణపేట ఆర్టీసీ శాఖలో జరిగిన అక్రమాలను సాక్షాదారులతో సహా నిరూపిస్తామన్నారు. యుక్త వయసులో ఉన్న విద్యార్థులు, విద్యార్థినిలు చీకటి సమయం వరకు బస్సు కోసం ఎదురు చూడగా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను రెచ్చగొట్టిన ఆర్టీసీ అధికారులపై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.






