యువకుడి కాలు తొడలో గుచ్చుకున్న చెట్టుకొమ్మ

by Disha Web Desk |
యువకుడి కాలు తొడలో గుచ్చుకున్న చెట్టుకొమ్మ
X

దిశ, అలంపూర్ : చెట్టు కొమ్మ కాలు తొడలో గుచ్చుకుని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన మాలిక్ (28) రోజు మాదిరిగానే ట్రాక్టర్‌లో ఇసుక లోడుతో మానపాడు వైపు వెళ్తుండగా అమరవాయి గ్రామ శివారులో బోల్తా పడింది. ఈ సంఘటనలో మాలిక్ (28) తొడ భాగంలో చెట్టు పైకొమ్మ ఇరుక్కుంది. తీవ్రంగా గాయపడి 15 నిమిషాల పాటు నొప్పిని భరిస్తూ కేకలు వేశాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ చంద్రకాంత్, మానవపాడు గ్రామస్తులు చేరుకుని కట్టెలు కోసే రంపంతో తొడలో ఇరుక్కున్న చెట్టుకొమ్మను అలాగే ఉంచి అటు ఇటు కోశారు. తొడలో ఇరుక్కున్న చెట్టుకొమ్మ బయటకు రాకపోవడంతో హుటాహుటిన మానోపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాలిక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed