నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశి వారు ఆఫీసుకు వెళ్తే జాగ్రత్త!

by Samataha |
నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశి వారు ఆఫీసుకు వెళ్తే జాగ్రత్త!
X

మేష రాశి : ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో బాగా సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు.

వృషభ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.దీర్ఘకాలిక రుణాలు కూడా తీరిపోయే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి.

మిథున రాశి : విద్యార్థులు అనుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషకర వాతావరణాన్ని నింపుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నేడు ఈ రాశి వారు ఆఫీసులో గొడవ పడే అవకాశం ఉంది. అందువలన ఆఫీసుకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి : ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ఆర్థికంగా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

సింహ రాశి : వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగి, అదనపు బాధ్యతల నుంచి, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా ఆచి తూచి వ్యవహరించడం మంచిది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే మొండి బాకీలు వసూలు కావడం లేదని బాధపడుతున్నారో వారికి ఈరోజు గుడ్ న్యూస్ అందుతుంది. ఎలాగైనా మీ డబ్బులు మీ చేతికి అందుతాయి.


తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఎవరినీ సంప్రదించకుండా డబ్బు పెట్టుబడి పెట్టకండి. వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. ప్రేమ కదలికలు సరిగ్గా జరగవు. ఈరోజు ఏది కావాలంటే అది చేయాలనుకుంటున్నాను, కానీ పని ఒత్తిడి కారణంగా నేను ఆపలేను.

వృశ్చిక రాశి: తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. ఏదైనా పనిప్రారంభించేముందు దాన్ని అర్ధంచేసుకుని దానియొక్క ఫలితాలు మీమీద ఎలాఉంటాయో తెలుసుకోండి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీరు అన్ని వివాహ ప్రమాణాల యొక్క అక్షర సత్యాన్ని నేర్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మీన రాశి: రిలాక్స్‌డ్‌గా ఉండే వ్యక్తులు ఈరోజు చాలా మంచి మూడ్‌లో ఉంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పనిసరి కుటుంబ సమావేశాలకు త్వరిత చర్య అవసరం. ఇది జరగకపోతే, తరువాత భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

Next Story