అవకాశాలు రానప్పుడు డైరెక్టర్లతో పర్సనల్‌గా మాట్లాడుతా.. టిల్లు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Javid Pasha |
అవకాశాలు రానప్పుడు డైరెక్టర్లతో పర్సనల్‌గా మాట్లాడుతా.. టిల్లు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : గ్లామరస్ హీరోయిన్ నేహాశెట్టి గురించి తెలిసిందే. ఒక్క మూవీతోనే యువత మనసు దోచేసిన ఈ బ్యూటీ నాజూకు అందాలతో అలరిస్తూ కెరీర్‌ పరంగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. డీజే టిల్లు చిత్రంతో బంపర్ ఆఫర్ అందుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రూల్స్ రంజన్, బెదరులంక, సినిమాల్లోనూ నటించిన నేహా శెట్టి తన నటన, అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో నేహా శెట్టి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్ మూవీలో కూడా ఓ గెస్ట్ రోల్‌లో తళుక్కుమంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘సినిమాల్లో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది జరగదు. అలాంటప్పుడు అవకాశాల కోసం మీరేం చేస్తారు?’ అనే ప్రశ్నకు నేహాశెట్టి ఈ సందర్భంగా బదులిస్తూ.. ‘చేసేదేం లేదు. డైరెక్టర్లతో టచ్‌లో ఉంటా. ఆఫర్లకోసం నేనే వాళ్లకి ఫోన్ చేసి అడుగుతుంటా. పర్సనల్‌గా డీల్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ‘ఇంతకీ ఏ విషయంలో పర్సనల్‌గా డీల్ చేస్తుందో ’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Next Story

Most Viewed