- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్పూర్ దగ్గర 700 కోట్లతో మిని ప్రాజెక్ట్
కృష్ణా జలాలను వృధాగా దిగువకు పోకుండా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాయచూర్ లో కర్ణాటక రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశ మయ్యారు.

దిశ, మక్తల్ : కృష్ణా జలాలను వృధాగా దిగువకు పోకుండా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాయచూర్ లో కర్ణాటక రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశ మయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కర్ణాటక- తెలంగాణ భాగస్వామ్య నిధులతో 700 కోట్లతో మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం కొల్పూర్ గ్రామం వద్ద మినీ జూరాల ప్రాజెక్టు (బ్యారేజ్ ) నిర్మాణం చేపట్టామని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వర్షాకాలంలో కృష్ణా నదికి వరదలు సంభవించిన ప్పుడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని, ఈ నీటిని సద్వినియోగ పరచుకోవాలనే అంశం పై ఇరువురు మంత్రులు సుధీర్ఘంగా చర్చించారు. కృష్ణా జలాలను కాపాడు కోగలిగితే మక్తల్ నియోజకవర్గంలో నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగు, తాగు నీటి అవసరాలు తీర్చవచ్చని అభిప్రాయపడ్డారు.
రాయచూర్ జిల్లాలో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి.. మక్తల్ నియోజకవర్గ మంత్రి వాకిటి శ్రీహరికి కర్ణాటక సాగునీటి ప్రాజెక్టుల మంత్రి బోసురోజు రాజకీయ గురువుగా వ్యవరించడంతో ఇరువురు మంత్రుల సాగునీటి ప్రాజెక్టుల పై తీసుకున్న నిర్ణయం చర్చలు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా ఈ మినీ ప్రాజెక్టు వల్ల నారాయణపేట జిల్లా మొత్తం భూములన్ని సాగవుడిలోకి వస్తాయని.. తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రివర్యులు బోస్ రాజ్, మాగనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.






