- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : బూరుగులపల్లి కృష్ణ యాదవ్
దిశ, జడ్చర్ల : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ

దిశ, జడ్చర్ల : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగులపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైన నిర్వహించాలని దాంతోపాటు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికైన నిర్వహిస్తామని ప్రకటించారని కానీ నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ద్వారానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం దారుణమని మండిపడ్డారు బీసీల 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే బీసీ సమాజం మొత్తం ఏకమై ప్రభుత్వంపై దండయాత్ర చేపడతామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఐక్యత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు 100కు 100% బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, ప్రనిల్ చందర్, శ్రీకాంత్, ఉమా శంకర్ గౌడ్, జాంగిర్ పాషా, శ్రీనివాస్ తెలుగు సత్తయ్య, రాములు, రేణుక బీసీ నాయకులు పాల్గొన్నారు






