- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
45 కేజీల యూరియా పేరుతో 39 కేజీల మోసం
మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామంలో ఓ రైతు యూరియా తీసుకురాగా యూరియా బ్యాగ్‌పై స్పష్టంగా 45 కేజీలు అని ముద్రించి ఉండగా.. లోపల మాత్రం కేవలం 39 కేజీల యూరియా మాత్రమే ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఉప్పలపహాడ్ గ్రామంలో ఓ రైతు యూరియా తీసుకురాగా యూరియా బ్యాగ్‌పై స్పష్టంగా 45 కేజీలు అని ముద్రించి ఉండగా.. లోపల మాత్రం కేవలం 39 కేజీల యూరియా మాత్రమే ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. రైతులు ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసే ఎరువుల్లో ఈ విధమైన తక్కువ బరువు బయటపడటం పట్ల అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలుచోట్ల రైతులు యూరియా బ్యాగ్‌లను తూకం వేయగా, ప్రతి బ్యాగ్‌లో సగటున 6 కేజీల వరకు తక్కువగా ఉండటం వెలుగులోకి వచ్చింది. ఇది స్పష్టమైన మోసం కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులు,వాతావరణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ తక్కువ బరువు మరింత నష్టాన్ని మిగులుస్తోందని వారు వాపోతున్నారు. యూరియా వంటి ముఖ్యమైన ఎరువులు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నా, తయారీ సంస్థలు లేదా సరఫరాదారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాగ్‌పై పేర్కొన్న బరువుకు లోపలి బరువుకు మధ్య ఇంత పెద్ద తేడా ఉండటం చట్ట విరుద్ధం అని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, తూకం కొలతల శాఖ తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్‌లో ఉన్న యూరియా స్టాక్ మొత్తాన్ని తనిఖీ చేసి, రైతులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ కోరుతున్నారు. ఈ ఘటన రైతుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయకపోతే సాగు వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి, రైతుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.






