మ‌ద్దిమ‌డుగు ఆంజ‌నేయ స్వామి ఆల‌య అభివృద్ధికి రూ.18కోట్లు మంజూరు

by Ratna Kumari |

నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం పదరా మండలం మద్దిమడుగు గ్రామంలోని పబ్బతి అంజనేయ స్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులు చేపట్టుటకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారం వ‌ల్ల‌ శుక్రవారం రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారి చేశారు.

మ‌ద్దిమ‌డుగు ఆంజ‌నేయ స్వామి ఆల‌య అభివృద్ధికి రూ.18కోట్లు మంజూరు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం పదరా మండలం మద్దిమడుగు గ్రామంలోని పబ్బతి అంజనేయ స్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులు చేపట్టుటకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారం వ‌ల్ల‌ శుక్రవారం రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారి చేశారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్ట‌డానికి ₹18 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే కృషి, పట్టుదల వలన మద్దిమడుగు అంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని స్థానికులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం PLAN-MDR Scheme కింద నిధులు మంజూరు చేశామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారి చేశారు. ఈ సందర్భంగా నల్లమల ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కి భక్తులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story