- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ బైపోల్.. మాగంటి సునీత వర్సెస్ పోలీసులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7గంటల నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోంది. మొదటి రెండు గంటల్లో 10శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. పలువురు సెలబ్రెటీలు, నేతలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7గంటల నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోంది. మొదటి రెండు గంటల్లో 10శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. పలువురు సెలబ్రెటీలు, నేతలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ పరిశీలిస్తుండగా ఆమెను అడ్డుకుని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అని పోలీస్ అధికారి ప్రశ్నించగా అలా అనొద్దు అంటూ సునీత మండిపడ్డారు. సింపుల్ గా తీసిపడేయవద్దని అన్నారు. అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా జూబ్లిహిల్స్ లోనే తిరుగుతున్నారని చెప్పారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఓటింగ్ ఎలాగైనా డిస్టబ్ చేయాలని చూస్తున్నారని, గొడవలు చేయాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాదన జరిగింది. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.






