Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-11 13:04:45  IST  )

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్ వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసినందుకు ఆమెను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(బీఆర్ఎస్) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, బీజేపీ తరపున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story