Maganti Gopinath : వదంతులు ప్రచారం చేయకండి : మాగంటి బంధువులు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Maganti Gopinath : వదంతులు ప్రచారం చేయకండి : మాగంటి బంధువులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తీవ్ర గుండెనొప్పితో గోపీనాథ్ ఇటీవల గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.

దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story