- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం..!
దువ్వాడ మాధురికి ఊహించని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీ భగ్నం

దిశ, వెబ్‌డెస్క్/చేవెళ్ల/మొయినాబాద్: నగరంలో స్థిరపడిన ఓ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారి అనుమతి లేకుండా నిర్వహించిన జన్మదిన పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకొని నిర్వాహకులు, ఫాంహౌస్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి మొయినాబాద్ పోలిస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారథి 20ఏళ్ల క్రితం నగరంలోని దిల్‌సుఖ్ నగర్‌లో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఇక ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని భాస్కర ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఫాంహౌస్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు.
అయితే ఈ పార్టీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం, హుక్కాను వినియోగించారు. దీనికి కూడా అబ్కారీ శాఖ నుంచి ఎటువంటి అనుమతి పొందలేదు. ఇక ఈ పార్టీలో ఏపీలోని వైఎస్ఆర్సీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిలతో కలిపి దాదాపు 29మంది పాల్గొన్నారు. అయితే పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్ పై దాడి నిర్వహించి అనుమతి లేని పార్టీని భగ్నం చేశారు. పార్టీలో వినియోగించిన మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌస్ యాజమాని సుభాష్, సూపర్ వైజర్ తతుద్దీన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్‌ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పార్టీలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు నోటీసులు ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా నగర శివారు మొయినాబాద్‌లో అనేక ఫాంహౌస్‌లు ఉండగా.. వీటిలో నిర్వహించే పార్టీలకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు.






