- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaleswaram Commission: కాళేశ్వరం విచారణకు ఎల్ అండ్ టీ హాజరు
కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ముందు విచారణకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ (L&T) ప్రతినిధులు హాజరయ్యారు. మేడిగడ్డ (Medigadda) పియర్స్ కుంగుబాటు, డిజైన్లు, నాణ్యత, నిర్వహణపై సంస్థ ప్రతినిధులను కమిషన్ ప్రశ్నిస్తోంది. నిన్నటి నుంచి నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నిస్తోంది. నిన్న సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన నవయుగ సంస్థ ప్రతినిధులను విచారించింది. గతంలో వారిచ్చిన అఫిడవిట్‌ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంపై దానిని నిర్మించిన ఎల్ అండ్ టీని ఇవాళ ప్రశ్నిస్తున్న పీసీఘోష్ కమిషన్ ఎలాంటి వివరాలు రాబట్టబోతున్నదనేది ఆసక్తిగా మారింది.






