- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఆర్ఎస్ రాయితీ గడవు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈనెలాఖరు వరకు 25శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్టు పురపాలక, పట్టణాభివ్రద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 30వరకు పొడిగించింది. తర్వాత మే3 వరకు మరోసారి అవకాశం కల్పించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతోపాటు ఫీజు చెల్లించిన దరఖాస్తులకు ప్రొసిడింగ్స్ ఇవ్వడంలో అధికారుల వైఫల్యం ఉంది. వీటన్నింటిని నేపథ్యంలో ఈనెలాఖరు వరకు 25శాతం ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివ్రద్ధిశాఖ కార్యదర్శి ఇలంబర్తి మంగళవారం జారీచేశారు.
- Tags
- LRS






