- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి మరో అవకాశం.. ఎల్‌ఆర్ఎస్ గడువు పొడిగింపు?
లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం ఫీజు రాయితీ గడువు శనివారంతో ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: లే అవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం ఫీజు రాయితీ గడువు శనివారంతో ముగిసింది. అయితే దీన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
రూ.1900 కోట్ల ఆదాయం
ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి రూ.1900 కోట్ల ఆదాయం వచ్చింది. 5.75లక్షల దరఖాస్తులకు సంబంధించిన ఫీజు చెల్లించారు. వీటిలో 1.5లక్షల దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ కూడా జారీచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 25.67 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. 5.67లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20,00,495 దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. ఇప్పటి వరకు 5.75 లక్షల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. ఫిబ్రవరిలో 14,104 మంది మాత్రమే చెల్లించారు. మార్చి 31 వరకు 3,64,104 మంది, ఏప్రిల్ నెలలో 2,10,896 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరు వరకు రాయితీ గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గ్రేటర్‌లో ప్రొసిడింగ్స్ ఇవ్వలే
జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి 14,252 మంది ఫీజు చెల్లించారు. దీని ద్వారా జీహెచ్ఎంసీకి రూ.175.53 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఒక్కరికి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. అయితే గ్రేటర్ లో 1.08లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 63,923 దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. దీంతోపాటు ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో 576 ఐజీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.






