TG News : తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-02 11:49:41  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్(LRS) పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(Land Regularization Scheme) రాయితీ గడువు మార్చ్ 31తోనే ముగియగా.. మరోసారి గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా గత నాలుగేళ్లలో పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. వీరికి 25% రాయితీ కల్పిస్తూ మార్చి 31 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గడువు ఇవ్వగా.. ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు మాత్రం జరగలేదు. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో.. ప్రభుత్వం ఈ గడువును ఏప్రిల్ 30 వరకు మరోసారి పెంచుతూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Next Story