బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన

by Naga Rani Yarlagadda |

తెలంగాణ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో వచ్చేవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలుగు రాష్ట్రాలమీదుగా ద్రోణి, బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఉన్నాయి. ఈనెల 11 నాటికి అల్పపీడనంగా మారితే మరోసారి కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

నేటి నుంచి రానున్న మూడ్రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శని, ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Next Story