- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు కావాలి.. నీ చెల్లి కావాలి! బంగారం తీసుకోని కామాంధుడి వేధింపులు
ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను యువకుడు ట్రాప్ చేశాడు. డబ్బు, బంగారం తీసుకురావాలని బెదిరింపులకు దిగాడు.

ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను యువకుడు ట్రాప్ చేశాడు. డబ్బు, బంగారం తీసుకురావాలని బెదిరింపులకు దిగాడు. అంతే కాకుండా చెల్లిని కూడా తీసుకురావాలని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యువకుడి వేధింపులకు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని ఘట్‌కేసర్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వాటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఏపీలో లిక్కర్‌స్కామ్ కేసు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ త్వరగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో అమలు చేయాలన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ‘నక్ష’ కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడం కోసం ‘నక్ష’ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద 152 మున్సిపాలిటీల్లో భూముల సర్వేకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌పై గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో నేడు జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






