తెలంగాణ లారీ ఓనర్లకు శుభవార్త

by Disha Web Desk 2 |
తెలంగాణ లారీ ఓనర్లకు శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని లారీ యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. లారీ యజమానుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్‌ల నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా శాఖ కమిషనర్ శ్రీనివాస రాజుతో సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణలో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని, పాత లారీలకు గ్రీన్ టాక్స్ తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, లారీలు ఓవర్‌లోడ్‌తో నడిపే డ్రైవర్లు లైసెన్స్ సస్పెన్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ పరిధిలో లారీల రవాణా రుసుంను వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు చేసిన విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.నందారెడ్డి, ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, చాంద్ పాషా, సలీం, లింగస్వామి గౌడ్, రాధాకృష్ణ, రాంరెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, లింగన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed