CBI, EDతో విచారణ చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై మోడీ ఎందుకు సైలెంట్: చిదంబరం

by Disha Web Desk 17 |
CBI, EDతో విచారణ చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై మోడీ ఎందుకు సైలెంట్: చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల నుంచి కాంగ్రెస్‌కు నల్లధనం అందిందని పీఎం మోడీ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చినా కూడా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు మౌనంగా ఉన్నారని చిదంబరం ప్రశ్నించారు. ఇద్దరు నేతల మౌనం అరిష్టమని ఎక్స్‌లో చిదంబరం అన్నారు. ఇంకా ఆయన వ్యాఖ్యానిస్తూ, గౌరవనీయులైన ప్రధాన మంత్రి చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు, అదానీ అంబానీల నుంచి నల్లధనం కాంగ్రెస్‌కు అందిందని అన్నారు. అయితే దీనిపై CBI లేదా ED ద్వారా విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినప్పటికి మీరు ఎందుకు అలా చేయడం లేదు, రాహుల్ డిమాండ్ సరైనదే కదా అని చిదంబరం ఎక్స్‌లో పేర్కొన్నారు.

బుధవారం ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన వెంటనే రాహుల్ గాంధీ అంబానీ-అదానీల గురించి మాట్లాడటం మానేశారు. అంటే వారి నుంచి కాంగ్రెస్‌కు నల్లధనం అందుతుందా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆరోపణలపై స్పందించిన రాహుల్‌ గాంధీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తాజాగా ఈ డిమాండ్ న్యాయమైనదేనని చిదంబరం అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed