ఫిష్ స్పా చేయించుకుంటున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే!

by Disha Web Desk 6 |
ఫిష్ స్పా చేయించుకుంటున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే!
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో అందరూ అందానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలే కాకుండా ఎంతోమంది కామన్ పీపుల్స్ కూడా పార్లర్‌కు వెళ్తూ అన్ని రకాలవి చేయించుకుని అందంగా మారుతున్నారు. ముఖం నుంచి పాదాల వరకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసి అందంగా మారేలా చూసుకుంటున్నారు. దీనికోసం పార్లర్‌లో పలు ఉత్పత్తులను వాడుతూ అందంగా కనిపించేలా చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్పా కూడా అందుబాటులోకి వచ్చింది. హెయిర్ స్పా, ఫేస్ స్పా, ఫిష్ స్పా వంటివి చేయించుకుంటూ గ్లామర్‌గా ఉండటానికి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్పా చేయించుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ స్పా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక అందంగా కనిపిస్తారంటే? ఎవరు మాత్రం కాదనుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఫిష్ స్పా చేయించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది పాదాలను అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*పాదాలకు ఫిష్ స్పా చేయించుకోవడం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఎక్వేరియంలో ఎంతో మంది కాల్లు పెడతారు కాబట్టి అందులోనే మీరు స్పా చేయించుకోవడం వల్ల వారికి ఉన్న రోగాలు మీకు వస్తాయి.

* అలాగే ఎక్వేరియంలోని నీటిని మార్చినప్పటికీ చేపలను మార్చరు కాబట్టి ఇతరుల పాదాలను కొరికినవే ఉంటాయి. అలాగే పలు బ్యాక్టీరియా ఉండి అది మీ శరీరంలోకి పోయి పలు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

* ఫిష్ స్పా చేయించుకునేటప్పుడు ఒక్కోసారి చేపలు గోర్లు కూడా కొరుకుతాయి. కాబట్టి నెయిల్స్ పాడైపోతాయి. ఫిష్ స్పా వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చి ప్రమాదంలో పడతారు. కాబట్టి స్పా విషయంలో పలు జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదా ఇంట్లోనే పాదాలను అందంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed