లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్.. ఫైనాన్షియర్ల వద్దకు పరుగులు పెడుతోన్న YCP క్యాండిడేట్స్..!

by Disha Web Desk 18 |
లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్.. ఫైనాన్షియర్ల వద్దకు పరుగులు పెడుతోన్న YCP క్యాండిడేట్స్..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అధికార పార్టీ అభ్యర్థులకు ఆర్థిక కష్టాల చుట్టుముట్టేశాయి. ఆకస్మికంగా పలువురు అభ్యర్థులు ప్రచారాన్ని పక్కన పెట్టి అప్పు కోసం ఫైనాన్సర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎనిమిది నుంచి పది రూపాయల వడ్డీ అయినా ఫర్వాలేదు అంటూ అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు. పంపిణీల సమయంలో అధిష్టానం డబ్బు మూటలకు బదులు రక్తహస్తం చూపడంతో చాలామంది షాక్‌లోకి వెళ్లిపోయారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఏప్రిల్ 16వ తేదీకి ఒకరోజు ముందే వైసీపీ అధిష్టానం అభ్యర్థులందరికీ రూ.15 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందజేసింది. కొందరు బాగా డబ్బు ఉన్న వారి మినహా మిగిలిన వారంతా పార్టీ ఫండ్‌ను అంగీకరించి అందుకొన్నారు. ఈ నిధులు వెంటనే ఖర్చుచేసే అవకాశం లేకుండా వీటిపై పరిశీలకులను కూడా నియమించి నిఘా పెట్టింది. ఓటర్లకు పంపిణీలు, ప్రారంభమయ్యే పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు మరో పది కోట్ల చొప్పున పంపుతామని, అవసరమైన వారికి మరింత సాయం అందజేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది.

*కానీ పది పడలేదు..

బుధ, గురువారాల్లో అధిష్టానం నుంచి మిగిలిన పది కోట్ల రూపాయలు వస్తాయని అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురు చూశారు. పడకపోవడంతో గతంలో పంపిణీ విధులు చేసిన ముఖ్యులకు ఫోన్ చేశారు. వారి వద్ద సమాధానం లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోయారు.

*ఇక అప్పులే గతి..

అధిష్టానం ఆఖరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న అభ్యర్థులు కొందరు ఫైనాన్స్ ల చుట్టూ తిరుగుతున్నారు. అధిష్టానం నుంచి వస్తాయని లెక్కలు వేసుకొని ఓటర్లకు పంపిణీలు ప్రారంభించిన అభ్యర్ధలు ఇప్పుడు రావాల్సిన మొత్తాలు రాకపోతే సగం మందికి పంచలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉరకలు పరుగులు పెడుతున్నారు. ఒక అమాత్యుడైతే పది కోట్ల ఒకరి దగ్గరే దొరకడం కష్టమైనందున కోటి, కోటి చొప్పున పది మందిని అడిగారు. ఎంపీ సీటు వదిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మరో ప్రముఖుడు నెల రోజులకు ఎనిమిది నుంచి పది రూపాయలు వడ్డీకి ఇవ్వాల్సిందిగా ప్రాధేయ పడుతున్నారు.

*బీజేపీ నిఘా ఎక్కువగా వుంది..పంపలేం?

బీజేపీ చేతుల్లో వున్న ఎన్నికల సంఘం నిఘా బాగా వున్నందున నగదు పంపలేమని అధిష్టానం చెబుతున్నట్లు తెలిసింది. ఎన్ని కలలో విజయావకాశాలు పెద్దగా లేవన్న స్వంత నివేదికలను ఆధారంగా చేసుకొని పంపిణీ ఆపేసి, నెపం బీజేపీ మీద, ఎన్నికల సంఘం మీద నెడుతున్నారని పార్టీ నేతలు గొణుక్కొంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed