- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lok Manthan: శిల్పకళా వేదికలో ఈ నెల 21నుంచి 24 వరకు లోక్‌మంథన్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
by Naga Rani Yarlagadda |
శుక్రవారం హైదరాబాద్ లో ఉన్న బేగంపేట (Begumpet) పర్యాటక భవన్లో లోక్ మంథన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్‌మంథన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఈ ఏడాది లోక్ మంథన్ (Lok Manthan 2024) జరగడం సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). శిల్పకళావేదిక (Silpakala Vedika)లో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్‌మంథన్ జరుగుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో ఉన్న బేగంపేట (Begumpet) పర్యాటక భవన్లో లోక్ మంథన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్‌మంథన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్‌మంథన్ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభం వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ఈ నెల 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story






