- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ పార్శిల్‌లో బల్లి.. కంగుతిన్న పిల్లలు..
జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సాయి కృష్ణ హోటల్‌లో ఆహారం తీసుకున్న ఓ కస్టమర్ కుటుంబం చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. వడ పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లిన ఆ కుటుంబం పిల్లలు వడతో పాటు చట్నీ తింటుండగా, అందులో బల్లి కనిపించడం కలకలం రేపింది.

దిశ,జనగామ : జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సాయి కృష్ణ హోటల్‌లో ఆహారం తీసుకున్న ఓ కస్టమర్ కుటుంబం చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. వడ పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లిన ఆ కుటుంబం పిల్లలు వడతో పాటు చట్నీ తింటుండగా, అందులో బల్లి కనిపించడం కలకలం రేపింది. బల్లిని చూసిన పిల్లలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని బాధిత తండ్రి తెలిపారు. వెంటనే హోటల్‌కు వెళ్లి హోటల్ యజమానిని నిలదీయగా, అది బల్లి కాదని, ఆకుకూరేనని సమాధానం ఇచ్చినట్టు వెల్లడించారు.
అయితే బాధితుడు "ఇది బల్లి కాదని మీరు కడిగి చూడండి" అన్నాడని, యజమాని కడగగా అది నిజంగా బల్లియే అని తేలినట్లు చెప్పారు. బాధితుడు వెంటనే పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇటువంటి హోటల్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఎప్పుడూ తనిఖీలు చేయక పోవడం వలన ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అని వెంటనే హోటల్ మూసివేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై దర్యాప్తు చేసి అసలు కారణాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు .
నిర్లక్ష్యాన్ని వదిలపెట్టం: చుక్క వినిల్ కుమార్.. జనగామ ఫుడ్ ఇన్స్పెక్టర్..
రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే హోటల్లో జరిగిన సమస్యపై మా దృష్టికి రావడంతో వెంటనే అక్కడికి వెళ్లడం జరిగింది ప్రస్తుతం అక్కడ తనిఖీలు చేసి వారికి పదివేల రూపాయల జారిమానాతో పాటు రెండు రోజుల పాటు షాపు క్లోజ్ చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో సేఫ్టీ మెటీరియల్ లో ఎలాంటి తేడాలు జరిగిన వదిలి పెట్టేది లేదు అని హెచ్చరించారు.






