- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIIT కి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లోని ఐఐటీ(IIIT)కి ఎంపికైన విద్యార్థుల జాబితా నేడు విడుదలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లోని ఐఐటీ(IIIT)కి ఎంపికైన విద్యార్థుల జాబితా నేడు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20,258 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా తొలి విడతలో 1,690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరగగా .. ఎంపికైన వారిలో 88 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఉండటం గమనార్హం.
కాగా సీట్లు పొందిన విద్యార్థులకు జులై 7, 8 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్ లో వివిధ కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం RGUKT అధికారిక వెబ్సైట్ https://tsrgukt.aptonline.in/TGRGUKT_BASAR/REPORTS/TGRGUKT_SELECTED_CANDIDATES.aspx లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story






