హైదరాబాద్ లో 4 రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ !

by velandi.Saikiran |   (  Updated:2025-04-21 06:49:14  IST  )

తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు బిగ్ షాక్. హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad ) ఏకంగా మూడు రోజుల

హైదరాబాద్ లో 4 రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ !
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు బిగ్ షాక్. హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad ) ఏకంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు ( Wines) మూతపడనున్నాయి. ఈ నెలలో ఇప్పటికే చాలా సార్లు వైన్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో.. మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ( Hyderabad Local Bodies MLC Elections) ఉన్నాయి.

దీంతో హైదరాబాద్ నగరంలో కోడ్ అమలులోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో... ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి. ఇవాళ సాయంత్రం 4:00 నుంచి ఈ బంద్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి... 23వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ క్లోజ్ చేస్తారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అంతేకాదు కౌంటింగ్ జరిగే 25వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా వరుసగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడుతున్న నేపథ్యంలో... మందుబాబులు ఇప్పుడే మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి... మద్యం దుకాణాల వద్ద రష్ ఎక్కువగా ఉంది. కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో... ఎంఐఎం పార్టీ గెలుస్తుందని... రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ( Congress ) మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు.

Next Story