తెలంగాణలో ముగిసిన మద్యం షాపుల డ్రా ప్రక్రియ

by Gantepaka Srikanth |

తెలంగాణలో మద్యం షాపుల డ్రా(Liquor Shop Draw) ప్రక్రియ ముగిసింది.

తెలంగాణలో ముగిసిన మద్యం షాపుల డ్రా ప్రక్రియ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం షాపుల డ్రా(Liquor Shop Draw) ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు సోమవారం అధికారులు, కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా తీశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో 179 మద్యం షాపులకు డ్రా ముగిసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైన్స్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు కొందరు సిండికేటై టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుండటంతో యువకులు, వ్యాపారులు మద్యం వ్యాపారంపై పలువురు కన్నేశారు. పలుచోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కవగా దరఖాస్తులు వేశారు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణంగా దరఖాస్తులు తగ్గినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఫీజు పెట్టిన విషయం తెలిసిందే. ఎంపికైన దరఖాస్తు దారులు అదే రోజు గానీ, మరుసటి రోజు గానీ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Next Story