- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు మోస్తరు వర్షాలు
తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతకు గురిచేస్తోంటే సాయంత్రానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతకు గురిచేస్తోంటే సాయంత్రానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు వీస్తోన్న తేమ గాలులే ఈ భిన్న వాతావరణానికి కారణమని వాతావరణశాఖ పేర్కొంది. రెండ్రోజులపాటు రాష్ట్రంలో వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ఈ ఉష్ణోగ్రతల కారణంగానే సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి వేస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎనుమాముల మార్కెట్లో అమ్మకానికి వచ్చిన పత్తి, మొక్కజొన్న వర్షపునీటిలో తడిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రోడ్లు జలమయమవ్వడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.






