- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తెలంగాణ కోసం పోరాడుదాం : కొదండరాం
అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని కోదండరాం విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆయన నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ.. గతాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఆశించిన తెలంగాణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నారని, భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పెద్ద ఎత్తున జరిగిన పోరాటం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు కోదండరాం తెలిపారు.
Also Read..






