మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురిపై చిరుత దాడి..

by Bhanu |

చిరుత పులి దాడిలో ముగ్గురు గాయపడిన సంఘటన శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురిపై చిరుత దాడి..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : చిరుత పులి దాడిలో ముగ్గురు గాయపడిన సంఘటన శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అచ్యుతాపూర్ గ్రామంలో జరిగింది. గొర్రెల కాపరి మై బన్న గ్రామానికి సమీపంలో శనివారం సాయంత్రం తన గొర్రెల మందను ఆపాడు. భోజనాలు చేసి నిద్రించిన తర్వాత గొర్రెల మందలో అలజడి కనిపించింది. ఏదైనా జంతువు.. లేదా కుక్క మందలోకి వచ్చిందేమో అన్న అనుమానముతో గొర్రెల కాపరి పక్కన ఉన్న రైతులు సత్యనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి ఇళ్లకు సమాచారం ఇచ్చాడు.

అందరూ కలిసి బ్యాటరీ సహాయముతో మందలో పరిశీలించారు. అప్పటికే ఆ చిరుత నాలుగు గోర్లను చంపి వాటి రక్తాన్ని తాగి.. గొర్లతోపాటు నిద్రిస్తున్న దృశ్యాన్ని చూశారు. ఈ ముగ్గురి మాటలు.. బ్యాటరీ లైట్ కు మేల్కొన్న చిరుత వెంటనే వారిపై దాడికి పాల్పడింది. ముగ్గురి అరుపులు కేకలతో పాటు.. గొర్ల అలజడికి వెనక్కి తగ్గిన చిరుత అదే రాత్రి చుట్టుపక్కల ఉన్న గుట్టలలోకి వెళ్లిపోయింది. సమాచారం అందిన వెంటనే వారి వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని అది రాత్రి హన్వాడ ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుండి గాయపడ్డ వారికి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాణాపాయము ఏమీ లేదు అని వైద్యులు ప్రకటించారు.

Next Story