కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయండి..! సీఎం రేవంత్‌‌కి మండలి చైర్మన్ లేఖ

by Ramesh Naini |

కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యంత్రిని కోరారు.

కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయండి..! సీఎం రేవంత్‌‌కి మండలి చైర్మన్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన ఊరు - మన బడి (Mana Ooru Mana Badi) కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ముఖ్యంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన తాజాగా (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనని కలిసి వారి పరిస్థితిని వివరించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద సివిల్ పనులు పూర్తయ్యాయని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు దీనిని ధృవీకరించారని పేర్కొన్నారు. రాష్ట్రం అంతటా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య కాబట్టి, పెండింగ్‌లో ఉన్న రూ.361.350 కోట్ల బిల్లులను విడుదల చేయాలని కోరారు. చిన్న, పేద కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు చేతి రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాకపోవడంతో నేడు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో వెల్లడించారు. మన ఊరు- మన బడి పథకం కింద రాష్ట్రం అంతటా పూర్తయిన సివిల్ పనులకు సంబంధించిన రూ.361.350 కోట్ల పెండింగ్ బిల్లులను అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Next Story