- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డబుల్ డెక్కర్’ కారిడార్‌గా L.B నగర్ - హయత్‌నగర్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నగరంలోని హయత్ నగర్‌లో రూ.10 కోట్ల రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ కారిడార్, బుల్లెట్ ట్రైన్లతో ఈ ప్రాంతం కోకాపేటలా మారుతుందని అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా, ప్రజా అవసరాల మేరకు రాజధానిలో పలు కీలక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హయత్ నగర్ సాయిబాబా ఆలయం (తొర్రూర్ x రోడ్) నుంచి ZEE స్కూల్ వరకు సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2-లేన్ నుంచి 4-లేన్ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
డబుల్ డెక్కర్ కారిడార్‌తో సరికొత్త రికార్డ్..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 940 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 200 కోట్లు కేటాయించింది. ఈ కారిడార్‌లో పైన మెట్రో రైలు, మధ్యలో నేషనల్ హైవే, కింద స్థానిక వాహనాల కోసం వెహికిల్ అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు..
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై-పూణే నగరాలను కలుపుతూ మూడు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఈ ప్రాంతం నుంచే రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో హయత్ నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కోకాపేటలాంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా మారుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్ - విజయవాడ 10-లేన్ల రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవంపై భావోద్వేగ వ్యాఖ్యలు..
మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ‘మూసీ విషజలాలతో నల్లగొండ ప్రజలు 30 ఏళ్లకే వృద్ధుల్లా మారిపోతున్నారు. కిడ్నీ, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో సతమతం అవుతున్నారు. ఇక్కడి ప్రజల గోసను మానవత్వంతో అర్థం చేసుకోండి. మురికి కూపంలా ఉన్న మూసీలో మంచి నీటిని పారేలా చేస్తామంటే అడ్డుకోవడం దేనికి?’ అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం భవిష్యత్తు తరాలకు మేలు చేస్తుందని, ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందని మంతి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసానిచ్చారు.






