మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధం: ఎల్ అండ్ టీ సంస్థ

by Ajay Maddhiboyina |

తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై ఎల్ అండ్ టీ సంస్థ స్పందించింది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పింది.

మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధం: ఎల్ అండ్ టీ సంస్థ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై ఎల్ అండ్ టీ సంస్థ స్పందించింది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పింది. డిఫెక్ట్ లయబులిటీ పిరియడ్ లోనే మేడిగడ్డ కుంగిందని, మరమ్మత్తులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా పునరుద్ధరణ పనులు చేయాలని సంస్థకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో పునరుద్ధరణ పనులు చేపడతామని, పెండింగ్ బకాయిల్ని క్లియర్ చేయాలని మరోసారి ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించగా ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ప్రాజెక్టును 2019లో నిర్మించగా అదే ఏడాది వరదల కారణంగా కుంగిపోయింది. తరవాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే కేంద్ర సంస్థలతో విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన తరవాత నిర్మాణంలోనే లోపాలు ఉన్నట్టు ఆ సంస్థలు వెల్లడించాయి.

Next Story