సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-22 15:44:41  IST  )

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు
X

దిశ, వెబ్ డెస్క్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు హైదరాబాద్ లో జరిగిన సీపీఐ రాష్ట్ర సభల్లో కార్యదర్శిగా కూనంనేని పేరును పల్లా వెంకట్ రెడ్డి ప్రతిపాదించగా.. దానిని మిగతా వారు బలపరిచారు. దీంతో కూనంనేని సాంబశివరావు వరుసగా రెండోసారి కూడా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం కూనంనేని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు.

కొత్తగూడెం పట్టణానికి చెందిన కూనంనేని సాంబశివరావు మొదట సాధారణ సీపీఐ కార్యకర్తగా ప్రస్థానం మొదలు పెట్టారు. 1984లో పట్టణ సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1987లో కొత్తగూడెం మండలపరిషత్ ఎన్నికల్లో గెలిచి మండలాధ్యక్షుడు అయ్యాడు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2005 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2009లో అప్పటి మంత్రి వనమాను ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

Next Story