నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |

ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకుని బయటకు నెట్టిన వ్యక్తి కేటీఆర్ (KTR) అని.. ఆమెకే సమాధానం చెప్పలేనోడు నాకు సవాలు విసుతుండటం విడ్డూరంగా ఉందని కోస్గీ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకుని బయటకు నెట్టిన వ్యక్తి కేటీఆర్ (KTR) అని.. ఆమెకే సమాధానం చెప్పలేనోడు నాకు సవాలు విసుతుండటం విడ్డూరంగా ఉందని కోస్గీ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమమంలోనే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా అంటూ ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది అంటూ రేవంత్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంగా దొరికిపోవడం.. ఆగమాగం కావడం.. అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.

నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగ్లతో రేవంత్ రెడ్డి చిందులు తొక్కుతుడని కేటీఆర్ అన్నారు. విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు.. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావా అంటూ ఆక్షేపించారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీకొడుతున్నా ఇంకా మారవా అంటూ కామెంట్ చేశారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు.. అదే నీ స్థాయి అని అన్నారు. పనికిమాలిన శపథాలు చేయడం.. పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనసభలో, జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ (Congress) జల ద్రోహాన్ని ఎండగడతామని అన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరగకపోతే చూస్తు వూరుకోమని.. పౌరుషం గల బిడ్డలం ప్రశ్నిస్తామని అన్నారు. ఆత్మగౌరవం లేని ఢిల్లీ (Delhi) బానిసలం తాము కాదని.. రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతామని అన్నారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవని హితవు పిలికారు. జనం అన్నీ గమనిస్తున్నారని.. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారని పేర్కొన్నారు. 2028లో తెలంగాణ (Telangana) ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని.. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story