‘ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో’.. CM రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో’.. CM రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఏసీబీ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రి(CM Revanth Reddy)గా ఉన్నాడు. ప్రజల దృష్టిని మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు. రోజుకో కుట్ర చేస్తున్నాడు. ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో పోరాటాలను ఆపలేవు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తాము చివరి వరకూ పోరాడుతాం. ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్‌లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు.

చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉంది. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కోవడానికి నేను సిద్ధం. రేవంత్ రెడ్డి సిద్ధమా?’ అని కేటీఆర్ సంచలన సవాల్ చేశారు.

Next Story